CTR: తమిళనాడు తిరువళ్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో నగరి విద్యార్థులు ప్రతిభకనబరిచారు. నగరి పట్టణ పరిధి నుంచి కరాటే మాస్టర్ రాజ్ కోటి ఆధ్వర్యంలో 10 మంది విద్యార్థులు ఈ పోటీలకు హాజరుకాగా, వీరిలో ఐదుగురు ప్రథమ స్థానాన్ని, ఇద్దరు ద్వితీయ స్థానాన్ని, ముగ్గురు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.