KRNL: ఆదోనికి చెందిన టీడీపీ యువ నాయకుడు బాలకృష్ణ (36) ఎమ్మిగనూరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మిగనూరులో క్రికెట్ టోర్నీలో పాల్గొని తిరుగు ప్రయాణంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.