NDL: గడివేముల మండలం గడిగరేవులలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా మంగళవారం కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన కోలాటం గ్రూపులకు మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండో బహుమతిగా రూ. 15 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు, నాలుగో బహుమతిగా రూ.5 వేలు అందజేయనున్నట్లు వెల్లడించారు.