NZB: జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు జక్రాన్పల్లి మండలం తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ర్యాపాన్ గంగోత్రి ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగ మోహన్ తెలిపారు. విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.