»Kcr Should Apologise Minister Sitakka Gave Legal Notice To Brs Party
Minister Sitakka: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీస్ ఇచ్చిన మంత్రి సీతక్క
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. తన ప్రతిష్టకు భంగం వాటిళ్లేలా తప్పుడు వార్తలు రాశారు, దీనిపై లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలంటూ పేర్కొన్నారు.
KCR should apologise.. Minister Sitakka gave legal notice to BRS party
Minister Sitakka: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. తన ప్రతిష్టకు భంగం వాటిళ్లేలా తప్పుడు వార్తలు రాశారు, దీనిపై లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలంటూ పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇచ్చింది. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని అందులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా వీడియోలు పెట్టారని ఆరోపించారు. తనపై చేసిన తప్పుడు ప్రచారానికి బహిరంగ లేఖతో క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
జూన్ 24 వ తేదీన బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్లో ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకరాళ్ల రాజ్యం పేరుతో ఓ పోస్ట్ పెట్టారని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారలు లేకుండా ఇలాంటి వీడియోలు సృష్టించి పెట్టడం సరైనది కాదని సీతక్క ఖండించారు. ఇలానే ఊరుకుంటే ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉంటారు, ఆరోపణలు చేస్తూనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. తనపై చేసిన ఈ తప్పుడు ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.