»Phone Tapping Another Twist In The Sensational Phone Tapping Case
Phone Tapping: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో.. మరో మలుపు
హైదరాబాద్‌లో తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు అయిన ప్రభాకర్‌రావు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ఇప్పట్లో హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు తెలిపారు.
Phone Tapping: Another twist in the sensational phone tapping case
Phone Tapping: హైదరాబాద్‌లో తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు అయిన ప్రభాకర్‌రావు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ఇప్పట్లో హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు తెలిపారు. అరెస్టయిన నలుగురు అధికారుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకున్నారు. కానీ ఈ కేసు ఇంకా ముందుకు వెళ్లడం లేదు. కారణం ప్రధాన నిందితుడైన ఎస్బీఐ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు విదేశాల్లో ఉండటమే దీనికి కారణం. ఫోన్ ట్యాపింగ్ కోసమే అప్పటి ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు అధికారాన్ని చేపట్టింది. అయితే ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగొస్తేనే ఈ కేసు ముందుకు సాగుతుంది.
కేసు నమోదు కావడానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిపోయారు. అయితే తాను పారిపోలేదని, జూన్‌కి తిరిగి వస్తానని తెలిపారు. కానీ ఆరోగ్య కారణాల వల్ల కొన్ని రోజులు అక్కడే చికిత్స కోసం ఉన్నట్లు తెలిపారు. అయితే ఆయనపై బ్లూకార్నర్ నోటీసు జారీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ప్రభాకర్‌రావు కేసు నమోదు కాకముందే విదేశాలకు వెళ్లారు. అంతకుముందు కూడా చికిత్స కోసమే చాలాసార్లు వెళ్లి వచ్చారు. కాబట్టి అతను పరారీలో ఉన్నారని అనడం కరెక్ట్ కాదు. కాబట్టి బ్లూకార్నర్ నోటీసు జారీ చేయలేదు. అలాగే ప్రభాకర్ రావు పాస్‌పోర్టును జప్తు చేయాలని రీజనల్ అధికారికి లేఖ రాశారు. కానీ అతని పాస్‌పోర్టు రద్దుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించకపోవచ్చు.