»Thief Leaves Apology Note After Robbing Tamil Nadu House Vows To Return Items 2
Thief : ఇంట్లో చోరీ.. నెలలో తిరిగి ఇచ్చేస్తానంటూ నోటురాసిన దొంగ!
ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడో దొంగ. అందులో చిత్రం ఏమీ లేదు గాని అక్కడ అతడు ఓ క్షమాపణ లేఖ రాసి వెళ్లాడు. దొంగిలించిన సామాన్లను నెలలో తిరిగి ఇచ్చేస్తానంటూ హామీ కూడా ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Thief Leaves Apology Note : కొన్ని దొంగతనాలను చూస్తే మనకు నవ్వొస్తుంది. అలాంటి దొంగతనమే తమిళనాడులో చోటు చేసుకుంది. దొంగ(Thief) ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అంత వరకు ఓకే కానీ.. అక్కడ అతడు పెట్టిన అపాలజీ నోట్(Apology Note ) చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘క్షమించండి. మీ ఇంట్లో దొంగిలించిన సామాన్లు అన్నీ ఒక నెలలో తిరగి ఇచ్చేస్తాను.’ అంటూ ఆ లేఖలో రాసి ఉంది. దీంతో ఆ ఉత్తరం ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అయ్యింది. ఇతనెవడో మంచి దొంగలా ఉన్నాడంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడులోని(Tamil Nadu) మేగ్నీనపురంలో ఈ చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరిలోని ఓ ఇంట్లో రిటైర్డ్ టీచర్ దంపతులు ఉంటారు. వారు గత నెల 17న కుమార్తె ఇంటికని చెన్నైకి వెళ్లారు. ఇంటిని శుభ్రం చేసేందుకు రోజూ పని మనిషి అక్కడికి వస్తుంది. మే 26వ తేదీన రోజులాగే ఆ ఇంటికి వచ్చింది. రావడంతోనే ఇంటి తలుపులు తెరచి ఉండటం చూసి అవాక్కయ్యింది. వెంటనే టీచర్ సెల్విన్కు సమాచారం అందించింది.
సెల్విన్ దంపతులు ఉన్నట్లుండి చెన్నై నుంచి తమ ఇంటికి వచ్చేశారు. చూసుకునే సరికి ఇంట్లోని రూ.60,000 పోయాయి. 12 గ్రాముల బంగారం, వెండి పట్టీలు లేనట్లుగా గుర్తించారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇంటికి వచ్చి దర్యాప్తు చేస్తుండగా వారికి ఒక లేఖ కనిపించింది. దానిపై నెలలో తిరిగి ఇచ్చేస్తాను క్షమించండి అంటూ రాసి ఉండటంతో వారు అవాక్కయ్యారు.