PPM: జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం స్దానిక తోటపల్లి డ్యామ్ పరిసరాలలోని పలు ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇంకా పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా తయారు చేస్తామని తెలిపారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.