JN: స్టేషన్ ఘనపూర్ డివిజన్ పరిధిలోని కొడకండ్ల మండలం 33/11కేవి మోండ్రాయి విద్యుత్ ఉపకేంద్రాన్ని TNPDCL జనగాం SE సంపత్ రెడ్డి నేడు సందర్శించారు. ఈ సందర్బంగా విద్యుత్ సిబ్బందికి సూచనలు చేశారు. వినియోగదారులకు నిరంతరంగా సరఫరా అందించేలా అప్రమత్తంగా ఉండాలని, సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించాలన్నారు. ప్రమాదాల నివారణకు ఎల్సీ యాప్ వాడాలన్నారు.