SKLM: జనవరి 19 నుంచి 25 వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 9న ఉదయం 8 గంటలకు కర్టైన్ రైజర్ ప్రారంభమవుతుందన్నారు.