JGL: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి పేర్కొన్నారు. ఇవాళ కథలాపూర్ మండలం ఇప్పపెల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంబ నవీన్, కార్యదర్శి మహేశ్, కిషన్, అంగన్వాడీ టీచర్ రాజమణి పాల్గొన్నారు.