NGKL: నాగర్ కర్నూల్ హౌసింగ్ బోర్డు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 20 తులాల వెండి ఆభరణాలు బైసాని సత్యనారాయణ- రమాదేవి దంపతులు ధనుర్మాసం సందర్భంగా అందజేశారు. సీతారాములు, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలకు వెండి కిరీటాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ప్రధాన అర్చకులు శ్రీకాంతాచార్యులు వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందించారు.