టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. తాజాగా గత జ్ఞాపకాలను బ్రాడ్ గుర్తుచేసుకున్నాడు. తనకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ తనలో కసిని రగిల్చిందని తెలిపాడు. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో తెలిసేలా చేసిందన్నాడు. తనను ‘వారియర్ మోడ్’లోకి తీసుకువెళ్లిందని చెప్పుకొచ్చాడు.