మెదక్ జిల్లా శంకరంపేట్-ఏ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు సిబ్బందికి సూచించారు. రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ మోసాలపై గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.