W.G: సంక్రాంతి వేళ కోడి పందేలు, పేకాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు కోరారు. ఇవాళ బూరుగుపల్లిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జూదం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ జడ్పీటీసీ బోనం నాని, మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరాజు పాల్గొన్నారు.