NZB: సాలూరు మండలం సాలంపాడ్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చలికాలం జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డా. రాజ్ కుమార్ సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున స్వెట్టర్లు, మఫ్లర్లు తప్పనిసరిగా ధరించాలన్నారు.