SKLM: కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ మేరకు జిల్లా, ఏపీలో క్రీడల అభివృద్ధిపై చర్చించారు. జిల్లాలో పాత్రునివలసలో 33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాజెక్టును గురించి ప్రత్యేకంగా చర్చించారు.