MDK: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. బుధవారం అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన మాట్లాడారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.