SKLM: సోంపేట మండలం కొర్లం జంక్షన్లో బారువ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను తనిఖీ చేయగా అతని వద్ద నుండి సుమారు 8.650 కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్, ఒక మొబైల్ ఫోన్, రూ.600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మంగరాజు ఇవాళ మీడియాకు తెలిపారు.