ADB: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఐపీ స్టేడియంలో పతంగుల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల భద్రత దృష్ట్యా కాగితపు పతంగులను మాత్రమే వినియోగించాలన్నారు. మాంజాకు బదులుగా కాటన్ దారాన్ని ఉపయోగించాలని ఆమె పిలుపునిచ్చారు.