ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ హిందీ దివస్ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సాయిప్రసాద్ మాట్లాడుతూ.. జాతీయ భాషపై ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా హిందీ భాష విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కాంచన, స్వామి, నర్సింగ్ రావు, చంద్రశేఖర్, రాజశేఖర్, రాహుల్ తదితరులున్నారు.