W.G: ఆదర్శ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుంపగడప విరిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీలు తమ సృజనాత్మకతను ప్రదర్శించగా, విజేతలకు లయన్స్ క్లబ్ సభ్యులు బహుమతులు అందజేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడంలో దోహదపడతాయని కళాశాల ప్రిన్సిపల్ కే. సుజాత తెలిపారు.