TPT: తిరుపతి రూరల్ తనపల్లి జంక్షన్ దగ్గర ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాదితుడిని రుయా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.