VSP: జీవీఎంసీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 4వేల కోట్లతో భారీ బడ్జెట్ను సిద్ధం చేసింది. వివిధ మార్గాల ద్వారా రూ. 2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, దానికి రెట్టింపు వ్యయం చేసేలా ముసాయిదాను రూపొందించారు. దీనిపై చర్చించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ఈనెల 12న సమావేశం కానున్నది.