GDWL: కేటిదొడ్డి మండల కేంద్రంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ స్కూల్ అందుబాటులోకి వస్తే నియోజకవర్గ విద్యార్థులకు సకల వసతులతో కూడిన నాణ్యమైన ఆంగ్ల విద్య లభిస్తుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, హాస్టల్ సౌకర్యం ఒకేచోట ఉంటాయని తెలిపారు.