NLG: చిట్యాలలో కొనసాగుతున్న జాతీయ రహదారి వంతెన నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం పరిశీలించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రహదారిపై వెళ్లే వాహన దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ నాటికి వంతెన పనులు పూర్తవుతాయని అన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉన్నారు.