W,G: తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం ఛైర్మన్ పత్తి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 90 రోజుల గాను రూ. 8,80,542 ఆదాయం వచ్చినట్లు ఆలయ పాలకవర్గం చైర్మన్ పత్తి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.