NDL: డోన్ YCP కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో శుక్రవారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని బుగ్గన ఆకాక్షించారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యాలయంలో పాల్గొన్నారు.