AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా జరిపినట్లు తెలిపారు. టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు. పది రోజుల్లో 7.83 లక్షలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని.. పదిరోజుల్లో హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు వచ్చినట్లు చెప్పారు.