SRCL: వేములవాడ రాజన్న ఆలయ వసతి గదుల సముదాయమైన పార్వతీపురంలోకి శుక్రవారం మళ్లీ నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో రాజన్న భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా పలుమార్లు రాజన్న ఆలయ వసతి గదుల సముదాయంలోకి వచ్చాయి. సమాచారం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ చాకచక్యంగా పట్టుకున్నారు. భక్తుల రక్షణ కోసం అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.