SRPT: సంక్రాంతి రద్దీ దృష్ట్యా జాతీయ రహదారి 65పై భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయినిగూడెం, పిల్లలమర్రి తదితర జంక్షన్ల వద్ద ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు పనులు జరుగుతున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.