GDWL: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని క్రాస్ రోడ్డు వద్ద వాహనదారులకు ఎస్సై స్వాతి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆమె కోరారు.