సత్యసాయి: సంక్రాంతి వేళ కోడిపందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ హెచ్చరించారు. ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో ఆటోల ద్వారా మైకు ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పందాలు నిర్వహించే వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.