GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నాగార్జునుడి ఆల్కెమికల్ వారసత్వంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ గంగాధరరావు మాట్లాడుతూ.. లోహశాస్త్రం, కెమికల్ ఇంజినీరింగ్ మరియు ఫార్మా రంగానికి నాగార్జునుడు వేసిన పునాదులు నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ప్రాచీన భారత విజ్ఞాన చరిత్రలో ఆయనది విశిష్ట స్థానమని కొనియాడారు.