AP: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో మంత్రి సత్యకుమార్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. ఆరోగ్యాంధ్ర నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో సవాళ్లను అధిగమించి చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. గతంతో పోలిస్తే ఓపీ, ఐపీలో చాలా మార్పు తీసుకురాగలిగామని చెప్పారు.