HYD: ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లానే పని చేస్తారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. నందినగర్‌లో వారు మాట్లాడుతూ.. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నీళ్ల సమస్య, ట్రాన్స్ పోర్ట్ సమస్య ఉందని ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకుండా తిరిగి మా భూములపై కన్నేశారని ఆరోపించారు.