యాంటీబయాటిక్స్ ప్రతి అనారోగ్యాన్ని నయం చేయలేవని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇవి కేవలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లపైనే పనిచేస్తాయని, జలుబు, ఫ్లూ వంటి వైరల్ సమస్యలకు పనిచేయవని తెలిపింది. యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడితే భవిష్యత్తులో మందులు పనిచేయని(AMR) ప్రమాదం ఉందని హెచ్చరించింది. డాక్టర్ సలహా మేరకే సరైన మోతాదులో వాడాలని ప్రజలను సూచించింది.