అన్నమయ్య: రాయవరం గ్రామ పంచాయితీ సర్పంచ్ షరీఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమాదేవి ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది సర్పంచ్ షరీఫ్‌ను శాలువాతో సన్మానించారు. మారుమూల గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.