ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా శుక్రవారం జరుగుతున్న ఆలయ గర్భగుడి నిర్మాణ పనులను ఆలయ ఈవో విజయరాజు పరిశీలించారు.ఈవో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే గర్భగుడి నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్నారు. ఆలయంలో ప్రతిరోజు స్వామి వారికి విశేష పూజలు జరుగుతున్నాయన్నారు.