NZB: వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ మండల న్యాయ సేవాధికార సంఘం, రోడ్డు రవాణా శాఖ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా, ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు.