AP: అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిపై జగన్ విషయం కక్కారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. వారి విధానాలకు విసిగి వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ‘అమరావతి మళ్లీ జీవకళ సంతరించుకోవడం చూసి జగన్కు కళ్లు కుట్టాయి. రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పట్టాలెక్కించడం జగన్కు మింగుడుపడట్లేదు. అమరావతిపై జగన్ కుట్రకు తెరదీశారు’ అని మండిపడ్డారు.