TG: కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోందని BRS విమర్శించింది. ‘ఒక్క ప్రాజెక్ట్ కట్టంది లేదు, ఒక్క హామీ పూర్తిగా అమలు చేసింది లేదు కానీ రేవంత్ ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల అప్పు చేసి ఢిల్లీకి మూటలు పంపారు. ఇప్పుడు రాష్ట్ర బాండ్లను వేలం వేసి మరో రూ.10,600 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. ఆదాయ వనరులను పెంచుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైంది’ అని దుయ్యబట్టింది.