BHPL: రేగొండ మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో ఇటీవల కాటారం మండలం గుండ్రాతీపల్లి గ్రామ సర్పంచ్ సావిత్రికి నకిలీ కుల సర్టిఫికెట్ జారీ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ విషయం బయటపడిన తర్వాత రేగొండ ఎస్సై రాజేష్ ఇవాళ కేసు నమోదు చేశారు. SI మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటన పై విచారణ కొనసాగుతోంది.