PPM: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి అన్నదాత సుఖీభవ పథకాన్ని వివరించారు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు.