TG: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆయన వాచ్ ఖరీదు రూ. కోటి అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా వాచ్ రూ. కోటి అని భావిస్తే.. బీఆర్ఎస్ నేతలు కేవలం రూ. 20-30 వేలు ఇచ్చి తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. ఆది శ్రీనివాస్ లాంటి బీసీ నేత ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.