MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ జన్నారం మండల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా మంగళవారం వారు జన్నారం తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం స్థానిక తాహసీల్దార్ రామ్మోహన్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు మధుసూదన్ రావు పాల్గొన్నారు.