RR: మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి కడ్తాల్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను, లాకప్‌ను పరిశీలించారు. కేసు నమోదు తీరు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పోలీసుల నిఘా పెంచాలన్నారు.