ASR: వారపు సంతల్లో నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలని కొయ్యూరు మండలం మంప ఎస్సై సీదరి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన గరిమండ వారపు సంతను సందర్శించారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించారు. వారపు సంతల్లో కల్తీ, గడువు ముగిసిన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుకాణాల్లో కల్తీ వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.