GNTR: జిల్లాలో గత ఏడాది కంటే రహదారి ప్రమాదాలు తగ్గాయని, ఇదే చొరవ కొనసాగాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు శ్రద్ధ వహించాలని గత 2024 సంవత్సరంలో 1046 ప్రమాదాలు జరిగాయని, 2025 సంవత్సరంలో 910 జరిగాయని తెలిపారు.