ధృవ సర్జా, రీష్మా ముఖ్యపాత్రలు పోషిస్తున్న తాజా చిత్రం ‘కేడీ ది డెవిల్’. సంజయ్ దత్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ‘సర్కే చునార్’ పాట వివాదాల్లో చిక్కుకుంది. పాట సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా ఉన్నాయి. దీంతో అన్ని ఫ్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని కేంద్ర సమాచారశాఖ మంత్రిత్వశాఖ CBFCని ఆదేశించింది.